News February 3, 2025

 హీరో అల్లు అర్జున్ గెటప్‌లో  ఎమ్మెల్యే జారే  

image

నిత్యం రాజకీయాల్లో బీజిగా ఉండే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. వైకుంఠపురంలో  హీరో అల్లు అర్జున్ గెటప్‌లో కనిపించారు. తలపాగా, కళ్లజోడు, ఓ చేతిలో కోడిపుంజు మరో చేతిలో కొడవలితో ఉన్న ఫొటో వైరల్ అవుతుంది. మేడారం సమ్మక్క- సారలమ్మను దర్శించుకునే క్రమంలో ఈ పోటో దిగారు. 

Similar News

News February 12, 2026

పెద్దపల్లి: ‘సమాజంలోని హింసపై మహిళలు ఉద్యమించాలి’

image

సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను రూపుమాపడానికి స్వశక్తి సంఘాల మహిళలు ఉద్యమించాలని సెర్ప్ రాష్ట్ర జెండర్ డైరెక్టర్ జమున పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల సోషల్ యాక్షన్ కమిటీ సభ్యుల శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చట్టాలపై అవగాహన, కమిటీల నిర్మాణం, జెండర్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News February 12, 2026

నల్గొండ: వృద్ధురాలిపై యువకుడి లైంగిక దాడి

image

మర్రిగూడ మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై 23 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మర్రిగూడ ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

News February 12, 2026

వనపర్తి: కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా శాంతి పద్ధతుల పరిరక్షణ కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద BNS 163 (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి చెప్పారు. వనపర్తి జిల్లా పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద 850 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.