News February 15, 2025
హీరో నితిన్‌కు ఎమ్మెల్యే బొజ్జల ఆహ్వానం

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు నితిన్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారిక ఆహ్వానం అందించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రత్యేక ఉత్సవాల్లో సినీ హీరో నితిన్ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు.
Similar News
News March 25, 2025
జీడీపీలో ఉమ్మడి పాలమూరు జిల్లా వెనుకబాటు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరుల ఉత్పత్తులు వినియోగంలో ఉమ్మడి పాలమూరు జిల్లాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల క్యాపిటల్ ఇన్కమ్, జీడీపీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రెండు అంశాల్లోనూ ఉమ్మడి జిల్లాగా ఉన్న పాలమూరు పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గా ఉండగా, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పరిస్థితి అధ్వానంగా ఉంది.
News March 25, 2025
దిలావర్పూర్ ఆందోళనకారులపై కేసులు ఎత్తి వేసేనా…?

గతేడాది దిలావర్పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. 130రోజుల నిరసనల తర్వాత ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఆందోళనకారులపై పెట్టిన కేసులను అధికారంలోకొస్తే తొలగిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తమపై కేసులు తొలగించాలని మహిళలు ఎదురుచూస్తున్నారని నిర్మల్ MLA మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
News March 25, 2025
పల్నాడు: విడదల రజనిని అరెస్ట్ చేస్తారా..?

చిలకలూరిపేటకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని అరెస్టు కానున్నారా? అనే విషయంపై పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2 కోట్ల నగదు అక్రమంగా వసూలు చేసినట్లు ఇప్పటికే ఆమెపై కేసు నమోదు అయింది. ఎంపీ కృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, మర్రి రాజశేఖర్ వంటి కీలక నేతలు ఆమెపై వరుస పెట్టి ఆరోపణలు చేస్తుండటం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.