News December 30, 2024
హుకుంపేట: దూలానికి బోర్డు.. రెండు రేకులే పాఠశాల పైకప్పు
అల్లూరి జిల్లా హుకుంపేట(M) ఎగరూడి గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. నిధులు మంజూరయినప్పటికీ పాఠశాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలిపారు. దీంతో రేకుల షెడ్డులో బోధనలు సాగుతున్నాయని చెప్పారు. ఎండ, చలి, విష సర్పాల నుంచి రక్షణ లేకుండా పోయిందని, పిల్లలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Similar News
News January 6, 2025
విశాఖలో ప్రధాని పర్యటన.. డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు
పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వారు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్, ప్రధాని పర్యటించే పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వినియోగం నిషేధమన్నారు. నిషేదాజ్ఞలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులకు శిక్షార్హులు అవుతారన్నారు.
News January 6, 2025
విశాఖలో ప్రధాని బహిరంగ సభకు 2లక్షల జనం..!
విశాఖలో ఈనెల 8న నిర్వహించనున్న ప్రధాన మోడీ బహిరంగ సభకు సుమారు రెండు లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంత్రులు, నేతలు ఇప్పటికే విశాఖలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సంపత్ వినాయక ఆలయం నుంచి ఏయూ గ్రౌండ్ వరకు నిర్వహించనున్న రోడ్ షోకు సుమారు లక్షమంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
News January 6, 2025
సింహాచలంలో నేటి నుంచి టికెట్ల విక్రయాలు
సింహాచలంలో జనవరి 10న నిర్వహించనున్న ఉత్తర ద్వారా దర్శనం టికెట్లు నేటి నుంచి ఈనెల 9 వరకు ప్రత్యేక కౌంటర్‌లో లభిస్తాయని ఈవో త్రినాధరావు తెలిపారు. కొండ కింద పిఆర్ఓ కౌంటర్‌లో రూ.500 టికెట్లు లభ్యమవుతాయన్నారు. www.aptemples.ap.gov.in వెబ్ సైట్‌లో కూడా దొరుకుతాయని వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో త్రినాద్ రావు తెలిపారు.