News February 2, 2025

హుజురాబాద్: చెరువు కుంటలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు స్నేహితులతో కలిసి చెరువు కుంటలో ఈతకు వెళ్లి వెంకట సాయి అనే 6వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. వెంకటసాయి మృతి చెందడంతో కందుగుల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 19, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరా వార్తల వివరాలు..

image

రాజన్న సిరిసిల్ల జిల్లా నేల వార్తలు వివరాలు..కారు ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు@హరితహారం చెట్లు నరికివేత..మాజీ ఎంపీపీ ఆగ్రహం@ఎల్లారెడ్డిపేట మడేలేశ్వర స్వామి ఆలయ మెట్లు ధ్వంసం@ఇసుక డంపును సీజ్ చేసిన తంగళ్లపల్లి ఎమ్మార్వో జయంత్ కుమార్@రాచర్ల బొప్పాపురం గ్రామంలో ఓ వ్యక్తి సూసైడ్: ఎస్ఐ రమాకాంత్

News February 19, 2025

జిల్లా కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్

image

జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీరు, సాగునీరు, రైతు భరోసా తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు పాల్గొన్నారు. జిల్లాలోని 75 ప్రభుత్వ సంక్షేమ శాఖల గురుకులాలు, వసతి గృహాలలో వినూత్నంగా విద్యార్థులకు డార్మిటరీలు ఫిర్యాదుల పెట్టే తీసుకొచ్చి చలికాలంలో వేడి నీరు అందించడం పై చర్చించారు.

News February 18, 2025

కరీంనగర్: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికీ 11 ఏళ్లు..

image

లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికీ 11 ఏళ్లు అయింది. 2014 ఫిబ్రవరి 18 ఇదే రోజున లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదించిన రోజు అని ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ గుర్తుచేశారు. కేసీఆర్‌ లాంటి దార్శనికత కలిగిన నాయకుడి నాయకత్వంలో ప్రజాఉద్యమంలో విజయం సాధించిన రోజు అని కొనియాడారు. పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని కేసీఆర్‌ నిరూపించిన రోజు అని తెలిపారు.

error: Content is protected !!