News February 2, 2025
హుజురాబాద్: చెరువు కుంటలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు స్నేహితులతో కలిసి చెరువు కుంటలో ఈతకు వెళ్లి వెంకట సాయి అనే 6వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. వెంకటసాయి మృతి చెందడంతో కందుగుల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 16, 2026
ప్రకాశం: నేడే లాస్ట్.. అప్లై చేశారా?

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు, మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల BPM, ABPM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 52 పోస్టుల ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 16, 2026
మాజీ ఎంపీ కన్నుమూత

AP: రాజ్యసభ మాజీ MP తడపట్ల రత్నాబాయి(79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో పోలవరం(D) రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చనిపోయారు. రత్నాబాయి 1972లో ఎల్లవరం(ప్రస్తుతం ర.చోడవరం) నుంచి కాంగ్రెస్ MLAగా గెలిచారు. 2008లో MPగా, 2014-20 వరకు MLCగా సేవలందించారు. అటు BC ఉద్యమ నేత, మాజీ MLC ఐలాపురం వెంకయ్య(93) అనారోగ్య సమస్యలతో నిన్న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.
News February 16, 2026
నేడు ప్రజావాణి రద్దు: సంగారెడ్డి కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎంపిక కార్యక్రమంలో అధికారులు పాల్గొననున్న సందర్భంగా ప్రజావాణి నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎవరూ తమ సమస్యలపై కలెక్టరేటుకు రావొద్దని కోరారు.


