News November 2, 2024

హుజురాబాద్ బ్రిడ్జిపై బోల్తాపడ్డ లారీ.. ట్రాఫిక్ జామ్

image

KNR జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వరంగల్-కరీంనగర్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లియర్ చేశారు.

Similar News

News December 9, 2024

ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోం: మంత్రి శ్రీధర్ బాబు

image

ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు వరంగల్ పర్యటన సమయంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. 6 గ్యారెంటీల వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని, ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తామన్నారు.

News December 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వెల్గటూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో ఆటో డ్రైవర్ మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ రామగుండంలో ప్రైవేట్ విద్యాలయం ప్రిన్సిపల్ పై దాడి. @ తంగళ్ళపల్లి మండలంలో మానేరులో దూకి వ్యక్తి ఆత్మహత్య. @ కథలాపూర్ మండలంలో మాజీ ఎంపీపీ భర్త మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్‌తో మేకలు, గొర్రెలు మృతి. @ మెట్పల్లిలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులు.

News December 8, 2024

సైలెంట్ కిల్లర్ కాదు.. నా శైలిలో ముందుకెళ్తున్నా: శ్రీధర్ బాబు

image

ఐటీ మంత్రిగా తనకు ఎవరితో పోలిక లేదని, తనదైన శైలిలో ముందుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వ ఐటీ మంత్రి కంటే మెరుగ్గా పనిచేస్తారా? అని మీడియా ప్రతినిధి అడగ్గా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని, తనదైన శైలిలో కృషి చేస్తానని అన్నారు. తమకున్న వనరులతోనే ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అలాగే తాను సైలెంట్ కిల్లర్ కాదని పనిలో నిమగ్నమవుతానని స్పష్టం చేశారు.