News January 24, 2025
హుజురాబాద్: హై స్కూల్ గ్రౌండ్లో గుర్తుతెలియని మృతదేహం

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్లో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 1, 2025
సంగారెడ్డి: అనుమతులు లేని కళాశాలలపై కఠిన చర్యలు

సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అనుమతులు లేని కళాశాలల్లో చేరి మోసపోవద్దని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలలోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులకు సూచించారు.
News November 1, 2025
నిజామాబాద్: పార్టీ పెట్టాలా? వద్దా..?

జనం బాటతో జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ పెట్టేందుకు MLC కవిత బాటలు వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో బలాబలాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా NZB, MBNR పర్యటన తర్వాత కరీంనగర్లో ఆమె పర్యటిస్తున్నారు. మేధావులు, రైతులు, కుల సంఘాలను కలుస్తూ తానెత్తుకున్న BC నినాదంపై ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు. ఈ పర్యటనల తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి పార్టీ పెట్టాలా? వద్దా? అనే నిర్ణయానికి ఆమె వచ్చే ఛాన్స్ ఉంది.
News November 1, 2025
JGTL: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీటే: SP

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్ ఓపెన్ చేయాలని SP ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణ, విచారణ వ్యవస్థను వేగవంతం చేయడం, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడం వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.


