News October 5, 2024

హుజూరాబాద్‌లో దారుణ హత్య

image

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజపల్లెలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాజు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 11, 2025

గంగాధర: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

image

గంగాధర మండలంలోని కూరిక్యాల, గంగాధర సహా పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటు ప్రక్రియ సజావుగా జరుగుతున్న తీరును, ఓటింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఎంపీడీవో డి.రాము, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

News December 11, 2025

కరీంనగర్: ఆ రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి- కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు 3-దఫాలుగా 2వ ఆర్డినరీ ఎలక్షన్స్ నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రకటించారు. మీ సంస్థలలో పనిచేసే కార్మికులకు 11, 14& 17 తేదీలలో (సంబంధిత మండలాలలో పోలింగ్ రోజున) వేతనం కూడిన సెలవు మంజూరు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులందరికి తెలియజేశారు. ఈ సెలవును దుకాణాలు, సంస్థల చట్టం 1988, సెక్షన్ 13 ప్రకారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

News December 11, 2025

కరీంనగర్: 11 గంటల వరకు 46.39% పోలింగ్ నమోదు

image

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 46.39% పోలింగ్ నమోదైంది. చొప్పదండిలో అత్యధికంగా 53.98% పోలింగ్ జరగ్గా, కరీంనగర్ రూరల్‌లో 49.64%, గంగాధరలో 45.16%, కొత్తపల్లిలో 46.19%, రామడుగులో 40.83% చొప్పున ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలలో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.