News June 26, 2024
హుజూరాబాద్: అవమానంతో వివాహిత సూసైడ్

హుజూరాబాద్ (M) ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వివాహిత అదే గ్రామానికి చెందిన నాగరాజుతో సంబంధం పెట్టుకుందని అతడి భార్య ఉమ, సోదరి తిరుమల, రాజ్‌కుమార్ ఆమెపై దాడి చేశారు. అవమానం భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంగళవారం సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించిందని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్ పేర్కొన్నారు.
Similar News
News February 14, 2025
కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
News February 14, 2025
కరీంనగర్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా విధులకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణపై కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తారని, అందువల్ల ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు.
News February 13, 2025
జగిత్యాల: మాటలకే పరిమితం కావొద్దు: MLC జీవన్ రెడ్డి

రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.