News April 12, 2024
హుజూరాబాద్: పెరిగిన బస్సు ఛార్జీలు!

హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ పెద్ద మోరీ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్న సందర్భంగా బస్సులు ములుగు రోడ్డు నుంచి తిరిగి వెళుతున్నాయి. దీంతో బస్సు ఛార్జీలు నేటి నుంచి ఆర్టీసీ అధికారులు పెంచారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండకు రూ.50 ఉంటే రూ.10 పెంచి రూ.60 చేశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రయాణికులపై భారం మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News March 26, 2025
KNR: సరైన అవగాహన.. సైబర్ నేరాలకు నివారణ

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈజీ మనీ కోసం ఆశపడి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నడిపే వారితో పాటు బెట్టింగ్‌లో పాల్గొనే వారిపై నిఘా ఉంటుందని అన్నారు.
News March 26, 2025
సైదాపూర్: వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

సైదాపూర్ మండలంలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఎవరికైనా జరిగిన విషయం చెబితే చంపుతానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 26, 2025
KNR: జపాన్-ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి యువ ఆవిష్కర్త ఎంపిక

కరీంనగర్‌కు చెందిన యువ ఆవిష్కర్త శుభ శ్రీ సాహు ఓ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్నప్పుడు రైతులకోసం ఒక వినూత్న వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఇటీవల ఆ ప్రాజెక్టు రూపొందించిన శుభ శ్రీ జపాన్౼ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుభ శ్రీ ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పాఠశాల ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు.