News March 16, 2025

హుజూర్‌నగర్‌లో నలుగురు నకిలీ ఎస్ఐలు అరెస్ట్

image

నలుగురు యువకులు గోల్డ్ షాప్ యజమానిని బెదిరించిన ఘటన HNRలో జరిగింది. పోలీసుల వివరాలు.. NLG జిల్లా నిడమనూరుకు చెందిన ప్రశాంత్, అక్షిత్, NLGకు చెందిన ఇరాన్, వాజిద్ APలోని కుప్పం SI డీపీని పెట్టుకున్నారు. HNRలో గోల్డ్ షాపు యజమానికి కాల్ చేసి నువ్వు దొంగల నుంచి గోల్డ్ కొన్నావు, జైలుకు పంపుతామని బెదిరించగా అతను భయపడి రూ.10 వేలు పంపాడు. అనుమానం వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.  

Similar News

News February 7, 2026

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుత్తూరు కృష్ణానగర్‌లో ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు కుమార్తెలు తేజ, లాస్యతో కలిసి తల్లి పద్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య, కుమార్తెల మృతిపై భర్త పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News February 7, 2026

తూర్పు, ఉత్తరం దిక్కులకే ప్రాధాన్యమెందుకు?

image

వాస్తు శాస్త్రంలో తూర్పు, ఉత్తర దిక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక బలమైన కారణాలున్నాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఎక్కువ మందికి వారి పేరు బలం, జన్మరాశి రీత్యా ఈ దిక్కులు బాగా కలిసివస్తాయి. ఇవి శుభ ఫలితాలను, లబ్ధిని చేకూరుస్తాయి. అనుభవజ్ఞులూ అదే చెబుతుంటారు. అందుకే ఇల్లు కొన్నా, కట్టినా, అద్దెకు తీసుకున్నా చాలామంది మొదట ఈ దిక్కులకే ప్రాముఖ్యతనిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 7, 2026

పాక్ గెలవలేదు.. మేమే ఓడిపోయాం: నెదర్లాండ్స్ బౌలర్ ఘాటు వ్యాఖ్యలు

image

T20 WCలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్థాన్ ఈ మ్యాచ్ గెలవలేదు. మేమే చేజేతులా ఓడిపోయాం’ అని అన్నారు. 148 పరుగుల టార్గెట్ ఛేదనలో పాక్‌ను కట్టడి చేసినా చివరి ఓవర్లలో ఎగ్జిక్యూషన్ లోపించిందని వాపోయారు. ముఖ్యంగా ఫహీమ్ అష్రఫ్ క్యాచ్ మిస్ చేయడం, డెత్ ఓవర్లలో భారీగా రన్స్ ఇవ్వడం తమ గెలుపును దూరం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.