News March 20, 2025
హుజూర్‌నగర్‌లో యువతిపై అత్యాచారం

HNRలో యువతిపై అత్యాచారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై ముత్తయ్య తెలిపిన వివరాలిలా.. పట్టణానికి చెందిన స్వామి రోజాకు ఓ యువతితో పరిచయముంది. రోజా ద్వారా ఆమె ప్రియుడు ప్రమోద్ కుమార్ యువతికి పరిచయమయ్యాడు. ఈనెల 7న ఆ యువతిని ప్రమోద్ కుమార్ ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఫోటోలు తీశారు. తిరిగి మంగళవారం ఆ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News March 28, 2025
రూ.లక్ష లంచం తీసుకుంటూ దొరికిన జిల్లా రిజిస్ట్రార్

AP: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన భార్య పేరిట ఉన్న గ్యాస్ ఏజెన్సీని తన పేరు మీదకు మార్చాలంటూ తునికి చెందిన రమేశ్‌బాబు రిజిస్ట్రార్‌ను ఆశ్రయించారు. ఇందుకు ఆయన రూ.లక్ష డిమాండ్ చేయడంతో రమేశ్ ఏసీబీకి సమాచారమిచ్చారు. దీంతో నిఘా వేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
News March 28, 2025
అల్లూరి జిల్లాలో 99 మంది దూరం

అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 99 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని DEO బ్రాహ్మజిరావు తెలిపారు. జిల్లాలో మొత్తం 71 పరీక్ష కేంద్రాల్లో 11,659 మంది విద్యార్థులు బయాలజికల్ సైన్స్ రాయవలసి ఉండగా 11,560 మంది రాసారని, 99.15 శాతం హాజరు అయ్యారని తెలిపారు. హుకుంపేట, పాడేరు మండలాల్లో 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
News March 28, 2025
NZB: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ

NZB నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మహిళ మృతదేహాన్ని కారు డిక్కీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలు కమలగా పోలీసులు గుర్తించారు. కంఠేశ్వర్ బైపాస్ వద్ద మహిళను హత్య చేసి, మాక్లూర్‌లోని దాస్ నగర్ కెనాల్లో పడేసేందుకు కారు డిక్కీలో మృతదేహాన్ని తరిలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.