News January 25, 2025
హుస్నాబాద్: అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా: మంత్రి

హుస్నాబాద్ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం రాత్రి హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత రైతు బజార్ వద్ద సుందరీకరణ జంక్షన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ప్రజలు మెచ్చే పాలనను అందిస్తున్నామని ఆయన తెలిపారు.
Similar News
News November 14, 2025
4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యచర్ ఎనర్జీస్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
News November 14, 2025
సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచండి: ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలని పోలీసులను ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్‌ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణం, లాకప్ గదులు, ప్రాపర్టీ స్టోరేజ్ రూమ్, కేసుల ఫైళ్లను సమగ్రంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, వాటిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
News November 14, 2025
ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్.. తర్వాత EVM ఓట్ల కౌంటింగ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉ.8 గం.కు పోస్టల్ బ్యాలెట్‌తో ప్రారంభం కానుంది. 8.30 గం. నుంచి EVM ఓట్ల కౌంటింగ్ షురూ చేస్తారు. షేక్‌పేట్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, యూసుఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ డివిజన్ల వారీగా లెక్కింపు జరగనుంది. ఈ నెల 11న జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,94,631 మంది ఓట్లేశారు. పోలింగ్ శాతం 48.49%గా నమోదైంది.


