News January 30, 2025
హుస్నాబాద్: ఉపాధిహామీ కూలీల మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి

అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గుంత తీసే క్రమంలో ఇద్దరి ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాలపై జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. ఉపాధి హామీలో ఇద్దరి మరణానికి కారణమైన ఘటనపై జిల్లా అధికారులతో విచారణకు ఆదేశించారు. గాయపడిన మరో ఇద్దరికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.
Similar News
News October 24, 2025
మత్స్యకారులను రప్పించేందుకు చర్యలు వేగవంతం: కలెక్టర్

బంగ్లాదేశ్ చెరలో చిక్కుకున్న విజయనగరం జిల్లా మత్స్యకారులను సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ, ఢాకాలోని భారత హైకమిషన్తో నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ద్వారా అధికారిక చర్చలు కొనసాగుతున్నాయన్నారు.
News October 24, 2025
పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు: ఎస్పీ

పోలీసుల అమర వీరుల వారోత్సవాలు జరుగుతున్నట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసుల విధులు, సేవలు, త్యాగాల గురించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని ఎస్పీ తెలిపారు.
News October 24, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప JC

కడపలో తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చెరువులు, వాగులు, వంకల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08562-246344 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.