News February 23, 2025
హుస్నాబాద్: తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ ఉదంతం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో శనివారం జరిగింది. వ్యవసాయంలో నష్టం రావడంతో బోనాల శ్రీనివాస్ (46) అనే రైతు పురుగు మందు సేవించి శుక్రవారం ఆత్మహత్యయత్నం చేయగా, హనుమకొండలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. శ్రీనివాస్కు ఇరువురు కుమార్తెలు ఉండడంతో అందులో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టింది.
Similar News
News November 16, 2025
SRCL: ‘బిర్సా ముండా స్ఫూర్తితో ముందుకు సాగాలి’

సిరిసిల్ల: భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శనివారం గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగర్వాల్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని, గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాలని ఆమె అన్నారు.
News November 16, 2025
ఇల్లంతకుంట: ‘ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేరుతోంది’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంతో సొంత ఇంటి కల నెరవేరుతున్నదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు
News November 16, 2025
కరీంనగర్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు: సీపీ

తమ కార్యాలయ పరిధిలో కొంతమంది పోలీసులు నెంబర్ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్/సీట్బెల్ట్ ధరించకపోవడం, బ్లాక్ ఫిల్మ్ వాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నట్లు గుర్తించిన సీపీ, కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి, పోలీసులు అయినా సరే, కఠినంగా ఈ-చలాన్లు జారీ చేయాలని ఏసీపీ ట్రాఫిక్కు ఆయన స్పష్టం చేశారు.


