News October 22, 2024

హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్లకు రూ.11.49 కోట్లు విడుదల

image

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ సీఆర్ఆర్ గ్రాంట్స్ నుంచి రూ.11.49 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొహెడ నుంచి తంగళ్లపల్లి (వయ కురెళ్ళ) వరకు 1.10 కి.మీ రోడ్డు కోసం రూ.1.55 కోట్లు, తంగళ్లపల్లి నుంచి శ్రీరాములపల్లి PWD రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.1.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.

Similar News

News November 14, 2025

విద్యాసాగర్ రావు కృషి అసామాన్యం: హరీశ్ రావు

image

సాగునీటి రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల కోసం ‘నీళ్ల సారు’ విద్యాసాగర్ రావు అసామాన్యమైన కృషి చేశారని ఆయన కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జల దోపిడీని, తెలంగాణకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి, చైతన్యపరచడంలో విద్యాసాగర్ రావు సేవలు మరువలేనివని హరీశ్ రావు తెలిపారు.

News November 13, 2025

మెదక్: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణం కొనుగోళ్లకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.

News November 12, 2025

మెదక్: ‘ఆన్లైన్‌లో సభ్యత్వ నమోదు చేసుకోండి’

image

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సభ్యత్వ నమోదు కోసం ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం టీఎన్జీవో భవన్లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్‌ను జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని అందజేశారు.