News January 28, 2025
హుస్నాబాద్: పొట్లపల్లి ఆలయంలో టెండర్లు పూర్తి

హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఫిబ్రవరిలో జరుగనున్న మహా శివరాత్రి సందర్భంగా సోమవారం శ్రీ స్వయంభూ రాజేశ్వర దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లలో కొబ్బరికాయలు, లడ్డూ, పులిహోర, తదితర వాటిని అమ్మకం దారులు వేలంపాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పూజారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
HEADLINES

* ముగిసిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్రానికి మొత్తం రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు
* 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం: TG CM రేవంత్
* అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్రలో నేతలంతా పాల్గొనాలి: AP CM CBN
* అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందే: సుప్రీంకోర్టు
* APలో లారీల బంద్ తాత్కాలిక వాయిదా
* ఈ నెల 12న అఖండ-2 విడుదల.. ప్రకటించిన మేకర్స్
* సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత్ ఘన విజయం
News December 10, 2025
ఆ లెక్కలు చంద్రబాబు సృష్టే: జగన్

AP: 2025-26 ఏడాదికి ప్రభుత్వం ఇచ్చిన GSDP అంచనాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. ‘ప్రజలను మోసం చేసేందుకే ఈ గణాంకాలను CBN మార్గదర్శకత్వంలో తయారు చేశారు. కాగ్ నివేదికలు నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. వాటి ప్రకారం ఆదాయాల పెరుగుదల తగ్గి, అప్పులు పెరిగాయి. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు, పెట్టుబడులు తగ్గాయి. రెవెన్యూ లోటు ఆందోళనకరంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
News December 10, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ నేటితో జిల్లాలో ముగిసిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
✓ ఎన్నికల సిబ్బంది రేపు రిపోర్ట్ చేయాలి: కలెక్టర్
✓ భద్రాచలంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
✓ ముక్కోటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం: కలెక్టర్
✓ గుండాల: యువతిని మోసం చేసిన నిందితుడికి 10 ఏళ్ల జైలు
✓ ఎన్నికలకు 1700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు: ఎస్పీ
✓ అన్నపురెడ్డిపల్లి: ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలి: డీఎస్పీ


