News March 7, 2025
హుస్నాబాద్: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ ప్రకటించామన్నారు. డీఏ పెంచడంతో ప్రభుత్వంపై 3.6కోట్ల భారం పడుతుందన్నారు. అంతే కాకుండా ఆడబిడ్డల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్తామన్నారు.
Similar News
News December 2, 2025
300 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

<
News December 2, 2025
590 లీటర్ల అక్రమ మద్యం సీజ్: సూర్యాపేట ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎస్పీ నరసింహ ఉక్కుపాదం మోపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 50 కేసుల్లో రూ.4.50 లక్షల విలువైన 590 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేసి, 291 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News December 2, 2025
KMR: మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీఎం

తాడ్వాయి మండలం దేమి గ్రామంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి నేడు పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడి, వారికి కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి మక్కల కొనుగోలు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


