News January 30, 2025

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ టూరిజం సర్క్యూట్‌!: CM

image

హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, NTR గార్డెన్, ఇందిరా పార్క్‌ను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని CM సూచించారు.

Similar News

News November 9, 2025

రెబకినా సంచలనం..

image

సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన WTA సింగిల్స్ ఫైనల్‌లో రెబకినా విజయం సాధించారు. ప్రపంచ నం.1 టెన్నిస్ ప్లేయర్ సబలెంకాతో జరిగిన మ్యాచులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో మ్యాచ్ వన్ సైడ్ కాగా 6-3, 7-6 పాయింట్లతో ఆమె టైటిల్ గెలిచారు. ఈ విజయంతో రికార్డు స్థాయిలో 5.2 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ రెబకినా ఖాతాలో చేరనుంది. ఈ ట్రోఫీ అందుకున్న తొలి ఆసియన్, కజికిస్థాన్ ప్లేయర్‌గానూ ఆమె నిలిచారు.

News November 9, 2025

నవంబర్ 9: చరిత్రలో ఈరోజు

image

* 1877: కవి మహమ్మద్ ఇక్బాల్ జననం
* 1895: ఆధునిక ఆంధ్ర కవి దువ్వూరి రామిరెడ్డి జననం
* 1924: రచయిత, కథకుడు కాళీపట్నం రామారావు జననం
* 1978: సినీనటుడు రాజా పుట్టినరోజు
* 2005: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణం
* 2009: నోబెల్ గ్రహీత హర‌గోబింద్ ఖురానా మరణం(ఫొటోలో)
* జాతీయ న్యాయ సేవల దినోత్సవం

News November 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.