News January 30, 2025
హుస్సేన్‌సాగర్ చుట్టూ టూరిజం సర్క్యూట్!: CM

హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, NTR గార్డెన్, ఇందిరా పార్క్‌ను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని CM సూచించారు.
Similar News
News November 25, 2025
ప్రారంభమైన ఆట.. బౌలర్లే దిక్కు

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే ఉంది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో SA 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ జట్టు 314 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. SAను త్వరగా ఆలౌట్ చేయకుంటే ఇండియా ముందు కొండంత లక్ష్యం పేరుకుపోవడం ఖాయం. బౌలర్లు ఏం చేస్తారో చూడాలి మరి.
News November 25, 2025
ADB: అన్నా మీరు సపోర్ట్ చేస్తే తప్పక గెలుస్తాం..!

స్థానిక ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో ఆశావహులు తమకే మద్దతు తెలపాలని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉమ్మడి ADBలోని 10 నియోజకవర్గాల్లో కేవలం నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతర నియోజకవర్గాల్లో వేరే పార్టీల MLAలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతల ఆధిపత్యం కొనసాగడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వరుస కడుతున్నారు.
News November 25, 2025
KUDA ఆధ్వర్యంలో రూ.584 కోట్ల పనులు!

కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో WGL నగరంలో రూ.584 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. KUDA 1,805 స్క్వేర్ కి.మీ ఏరియాలో సేవలు అందిస్తోంది. 181 రెవెన్యూ గ్రామాలతో మొత్తం 13 లక్షల జనాభా ఉంది. ఇప్పటికే రింగ్ రోడ్, కాళోజీ కళాక్షేత్రాలను రూ.352 కోట్లతో నిర్మించగా, తాజాగా రూ.110 కోట్లతో టెంపుల్ టూరిజం పేరిట భద్రకాళి బండ్, మరో రూ.150 కోట్లతో గేట్ వేలు, జంక్షన్లు, బస్టాండ్లను నిర్మించబోతున్నారు.


