News February 13, 2025
హుస్సేన్‌సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.
Similar News
News March 12, 2025
కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు తప్పిన ప్రమాదం

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ఢిల్లీలో ప్రమాదానికి గురైంది. విజయ్ చౌక్ నుంచి ఎయిర్‌పోర్టుకు ఆయన కారులో బయల్దేరగా దారిలో ఓ వాహనాన్ని తప్పించబోయి మంత్రి కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు శ్రీనివాస వర్మ వాహనాన్ని ఢీకొట్టింది. సడన్ బ్రేక్ వేయడంతో మంత్రి తల, కాలుకు గాయాలయ్యాయి. కాలికి బలమైన గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
News March 12, 2025
జగిత్యాల: ఈనెల 15న జాబ్‌మేళా

జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఈ నెల 15న జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయిన ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ తెలిపారు. సర్వీస్ సలహాదారుడు, సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్, టెక్నీషియన్ ఖాళీలు ఉన్నాయని డిగ్రీ, ఐటీఐ చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10:30 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.
News March 12, 2025
రేపు కలెక్టర్ అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. రేపు అనంత రేడియో స్టేషన్ నుంచి ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ప్రజలతో సమస్యలు తెలుసుకోనున్నారు. 08554-225533 నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు.