News September 11, 2024
హెక్టార్‌కు రూ.25 వేలు ఇస్తాం: చంద్రబాబు
వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్‌కు రూ. 25 వేలు చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 65 వేల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఏలేరు రిజర్వాయర్‌కు అధికంగా వరద రావడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయని చెప్పారు.
Similar News
News November 28, 2024
రాజమండ్రి: నేర సమీక్షా సమావేశం నిర్వహించిన SP
రాజమండ్రిలోని తూ.గో జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ బుధవారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రౌడీ షీటర్లు& పాత ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నాటు సారా, గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేయాలని ఆదేశించారు. సైబర్ భద్రత, రోడ్డు భద్రత, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.
News November 27, 2024
రాజమండ్రి: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూ.గో జిల్లా SP నర్సింహ కిషోర్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 25న రాజమండ్రికి చెందిన బి.రమేష్ SVS కోచింగ్ సెంటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై అతను 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విశాఖ జిల్లాకు చెందిన నిందితుడు డి.నాగేశ్వరావును అదుపులోకి తీసుకున్నారు.
News November 27, 2024
కడియం: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
కడియం మండలం వేమగిరి 216 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ బి.నాగదుర్గ ప్రసాద్ తెలిపారు. వేమగిరి గట్టుకి చెందిన కల్లా దుర్గ ఆమె మేనకోడలు పితాని రూపాదేవి స్కూటీపై డిగ్రీ పరీక్షలు రాసేందుకు రాజమండ్రి వెళ్తుండగా వేమగిరి సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపాదేవి మృతిచెందగా మరో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.