News October 27, 2024
హెచ్సీఎల్ అవార్డు అందుకున్న జుక్కల్ వాసి

భారత్ ఆర్మీలో విధులు నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో భాగంగానే అనేక శిఖరాల ఎత్తుకు ఎదిగి దేశానికి అందించిన సేవలను గుర్తించిన హెచ్సీఎల్ అవార్డుకు జుక్కల్ వాసి ఎన్నికయ్యారు. మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామానికి చెందిన ఉమాకాంత్కు శనివారం బెంగళూరులోని హెచ్సీఎల్ ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల గ్రామస్థులు, జుక్కల్ మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 6, 2026
జక్రాన్పల్లి: ఉరేసుకొని వృద్ధురాలు ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉరేసుకొని ఓ వృద్ధురాలు బలవన్మరణం చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. మునిపల్లికి చెందిన ఆరే గంగు(85) గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో కాలుజారి కింద పడగా తుంటి ఎముక పెరిగింది. దీంతో మనస్థాపానికి గురైన వృద్ధురాలు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.
News January 6, 2026
NZB: పాముకాటుతో వ్యక్తి మృతి.. కేసు నమోదు

మోపాల్ మండలం శివలాల్ తండాలో పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై సుశ్మిత తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన కేతావత్ రామచందర్(43)కు పొలంలో పనిచేస్తుండగా పాము కరిచింది. దీంతో అతన్ని NZBలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స సమయంలో కోమాలోకి వెళ్లడు. అనంతరం హైదరాబాద్కు తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో మృతి చెందాడు.
News January 5, 2026
నిజామాబాద్: సంక్రాంతి ప్రయాణమా.. జాగ్రత్తలు తప్పనిసరి!

సంక్రాంతి సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నగలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇంటికి బలమైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని చెప్పారు. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఇంటిని పర్యవేక్షించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘డయల్ 100’కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.


