News February 1, 2025
హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్

సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనందున ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
Similar News
News February 13, 2025
చేగుంట: తండ్రి మందలించడంతో కొడుకు సూసైడ్

చేగుంట మండలం వడియారం గ్రామంలో మద్యం తాగొద్దని తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఘన బోయిన శివకుమార్ అలియాస్ శివుడు(30) నిన్న రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో శివుడు ఇంట్లోంచి బయటకు వెళ్లి పురుగు మందు తాగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఇవాళ మృతి చెందాడు.
News February 13, 2025
ఉన్నత స్థానంలో స్థిరపడాలి: అడిషనల్ కలెక్టర్

ప్రతి విద్యార్థి బాగా చదువుకొని జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆకాంక్షించారు. హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమై మెనూ పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. పిల్లల బాగోగులు తెలుసుకున్నారు.
News February 13, 2025
మెదక్: కాంగ్రెస్‌లో చేరిన మాజీ డీఎస్పీ

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎం.గంగాధర్ బుధవారం ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల గంగాధర్ డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు.