News December 27, 2024
హెల్మెట్ ధరించటం భారం కాదు బాధ్యత: ఎస్పీ

పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో వాహనదారులకు నిర్వహించిన హెల్మెట్పై అవగాహన కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ తలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను గులాబీలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ నారాయణస్వామి, ఎస్ఐ మేరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. మట్టి నమూనాల సేకరణ

హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించతలపెట్టిన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా, గుంటూరు జిల్లాలో ఫైనల్ లొకేషన్ సర్వే బుధవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. DPR రూపొందించడం, ఫైనల్ ఎలైన్మెంట్ డిజైన్ కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా, 20 మీటర్ల లోతులో ప్రతి 5 మీటర్లకు ఒకసారి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు.
News September 17, 2025
శాసన సభ స్పీకర్ను కలిసిన గుంటూరు ఎస్పీ

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్ బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంతోపాటు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని స్పీకర్ సూచించారు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకొని ప్రజా భద్రతను కాపాడాలని స్పష్టం చేశారు.
News September 17, 2025
వెలగపూడి: బీసీ రక్షణ చట్టంపై మంత్రి అనగాని సమీక్ష

బీసీల రక్షణ కోసం చట్టం రూపొందించడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలపై సహచర మంత్రులతో ఆయన చర్చించారు. బీసీల హక్కుల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.