News February 2, 2025
హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే ప్రాణాలు సురక్షితం: ఎస్పీ జగదీశ్

హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు సురక్షితమని.. ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణం చేయాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతుండటం మనం చూస్తున్నామన్నారు. ఈ విచార ప్రమాద ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.
Similar News
News February 10, 2025
రాప్తాడు వైసీపీలో ముసలం

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది.
News February 10, 2025
ఓవరాల్ ఛాంపియన్ షిప్ అనంత జిల్లా

నగరంలోని పీటీసీ నందు ఈనెల 7వ తేదీ నుంచి 9వ జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో అనంతపురం జిల్లా క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ఈ ట్రోఫీను మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీపతి, జిల్లా అధ్యక్షుడు సుధాకర్ బాబు, సెక్రటరీ సికిందర్, చేతుల మీదుగా అందజేశారు. ఈ క్రీడా పోటీల్లో 30 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వయస్సు ఉన్న పురుషులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
News February 10, 2025
అనంతపురంలో భారీ చోరీ.. ధార్ గ్యాంగ్ అరెస్ట్

అనంతపురం శ్రీనగర్ శివారు కాలనీలో 18 రోజుల క్రితం జరిగిన భారీ చోరీ కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సభ్యుల ధార్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 59 తులాల ఆభరణాలు, రూ.19.35లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడిపై పలు రాష్ట్రాల్లో 32 కేసులు ఉన్నాయని తెలిపారు.