News July 15, 2024

హైకోర్టులో నందిగం సురేశ్ పిటిషన్‌ విచారణ.. రేపటికి వాయిదా

image

మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 24, 2025

ఆధార్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జనన ధృవీకరణపత్రాలు లేని వారిని గుర్తించి వారికి ఆధార్ కార్డులు జారీ చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్ వీసీ హాలులో రెవెన్యూ రీ సర్వే , గృహనిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయ సేవలు, ఉపాధి హామీ పథకం అంశాల కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రీసర్వేలో మ్యూటేషన్లు దరఖాస్తులపై రెవెన్యూ డివిజన్ అధికారులు పత్యేక శ్రద్ధ తీసుకొని పరిశీలించాలన్నారు.

News November 24, 2025

అమరావతి: 10 లక్షల సురక్షిత పనిగంటలు పూర్తి

image

అమరావతిలో నిర్మిస్తున్న హౌసింగ్ & బిల్డింగ్ ప్రాజెక్టులలో భాగంగా NGO టవర్స్ 9 & 12 నిర్మాణ పనులను L&T కన్‌స్ట్రక్షన్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ఈ నెల 18 వరకు 10 లక్షల సురక్షితమైన పనిగంటలను లాస్ట్ టైమ్ ఇంజరీ లేకుండా విజయవంతంగా పూర్తిచేసిందని అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్టులో సాధించిన మైలురాయి నిర్మాణ రంగంలో CRDA పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనమన్నారు.

News November 24, 2025

మంగళగిరి చేనేతలకు గుడ్‌న్యూస్.. 12% మజూరీకి అంగీకారం

image

మంగళగిరి చేనేత కార్మికులు 2025-27 కాలానికి 12% మజూరీ రేటు ఇచ్చేందుకు అంగీకరించినట్లు మంగళగిరి చేనేత కార్మిక సంఘ సమన్వయ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. సోమవారం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మజూరి పెంపుదలపై సమావేశం నిర్వహించారు. ఆమోదించిన మజూరి ప్రకారం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్, మంగళగిరి వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నామని బాలకృష్ణ చెప్పారు.