News March 27, 2025

హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విడదల రజిని 

image

నేడు హైకోర్టులో విడదల రజిని పిటిషన్‌పై విచారణ జరగనుంది. స్టోన్ క్రషర్ యాజమాన్యానికి బెదిరింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రజిని పిటిషన్ వేశారు. ఎడ్లపాడు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గర రూ.2.20కోట్లు తీసుకున్నట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. హైకోర్టు బెయిల్ విషయంలో గురువారం తీర్పు ఏమి చెబుతుందనే మాజీ మంత్రి విడదల రజిని శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 

Similar News

News November 13, 2025

కామారెడ్డి: రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు శిక్షణ

image

కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గురువారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వ్యవసాయ రంగంలో సమూహ బలం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.

News November 13, 2025

ఈ నెల 14న 58వ జాతీయ గ్రంధాలయం వారోత్సవాలు

image

వనపర్తిలోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంధాలయం వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ జి గోవర్ధన్, కార్యదర్శి బి.వెంకటయ్య తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు సాగే వారోత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభిస్తారన్నారు. విద్యార్థిని, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

News November 13, 2025

MHBD: బీసీ విద్యార్థులకు ఉపకార వేతన దరఖాస్తులు ఆహ్వానం

image

2025-26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ-పాస్ వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.