News July 21, 2024
హైకోర్టులో విజయసాయి రెడ్డి కుమార్తెకు ఊరట
విశాఖ జిల్లా భీమిలి వద్ద MP విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ కూల్చి వేయాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై మరొకరు వేసిన పిల్ విచారణకు రావడంతో.. దాంతో నేహారెడ్డి పిటిషన్ జత చేయాలని కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని అధికారులకు సూచించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రహరీ నిర్మించారని సమాచారం.
Similar News
News December 9, 2024
మరోసారి ఎంపీగా బీదకు ఛాన్స్..?
కావలికి చెందిన బీద మస్తాన్ రావు వైసీపీ, రాజ్యసభ ఎంపీ పదవికి ఇటీవల రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి రాజ్యసభ ఎంపీగా బీదకే టీడీపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని సమాచారం. రేపు సాయంత్రంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం లోపు టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
News December 9, 2024
నెల్లూరు: 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియకు 4వ సారి కలెక్టర్ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. జిల్లాలోని ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి 6 ప్రాజెక్టు కమిటీలు, 13 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వీటితోపాటు 490 వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, 3698 టీసీలకు ఎన్నికలు జరుగుతాయి.
News December 9, 2024
వ్యభిచారం చేయిస్తున్న నెల్లూరు జిల్లా వాసి అరెస్ట్
నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన శ్రీరాములు, తిరుపతిలోని ఎర్రమిట్టకు చెందిన ఓ మహిళ తిరుపతి రైల్వేకాలనీలో ఇంటిని బాడుగకు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. కోస్తా అమ్మాయిలు దొరకగా.. వాళ్లను హాస్టల్‌కు తరలించారు. మహిళతో పాటు శ్రీరాములును అరెస్ట్ చేశామని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపారు.