News February 26, 2026
హైకోర్టు ఆగ్రహం.. కడప జిల్లాలో పలువురు అధికారుల బదిలీ.!

కడప జిల్లాలో ఆర్డీవో, ఎంపీడీవోలుగా పనిచేస్తున్న పలువురు అధికారులకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. 2018 APPSC నిర్వహించిన గ్రూప్ 1, 2 ఫలితాల్లో ఉద్యోగాలు పొందిన చాపాడు MPDO వీర కిషోర్, గోపవరం MPDO రామనాథరెడ్డి, బద్వేల్ MPDO మల్లేశ్వరి, చిన్నమండెం ఎంపీడీవో దివ్య, కడప మున్సిపల్ కమిషనర్, జమ్మలమడుగు, కడప RDOలను బదిలీ చేశారు. 2018 గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని, తదుపరి ఆదేశాల వరకు GADకు అటాచ్ చేశారు.
Similar News
News April 18, 2026
పాడేరు: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గమనిక

ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థులు అవసరం అయితే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలని ఉమ్మడి అల్లూరి జిల్లా ఇంటర్ విద్యాధికారి భీమశంకరరావు శనివారం తెలిపారు. రీ కౌంటింగ్‌కు ఒకొక్క పేపర్‌కు రూ. 260, రీ వెరిఫికేషన్‌కు రూ.1300 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్లైన్లో మాత్రమే ఈ నెల 27లోగా అప్లై చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
News April 18, 2026
ములుగు అరణ్యంలో విలసిల్లిన బౌద్ధమతం..!

ఎక్కడి కంబోడియా.. ఎక్కడి ములుగు.. అక్కడి అంగ్‌కోర్‌వాట్ ఆలయాన్ని పోలిన ఓ కట్టడం ములుగు మండలం కొత్తూరు దేవునిగుట్టపై ఉంది. 6వ శతాబ్దంలో బౌద్ధ మతంలోని వజ్రాయన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ రాతి ఇటుకలతో విష్ణుకుండినులు ఆలయం నిర్మించినట్లు చరిత్రకారులు నిర్ధారించారు. పలువురు విదేశీ పరిశోధకులు అధ్యయనం చేశారు. 1400 ఏళ్ల నాటి ఈ చారిత్రక కట్టడాన్ని సంరక్షించడంలో పురావస్తు శాఖ చొరవ తీసుకోవాల్సి ఉంది.
News April 18, 2026
శకుంతల-దుష్యంతుల ప్రేమ గాథల కుంటాల

ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతం పాదాల చెంత గుహలో పురాతన సోమేశ్వర ఆలయం ఉంది. శకుంతల-దుష్యంతుల ప్రేమ గాథకు ఈ ప్రాంతమే సాక్షి అని, అందుకే దీనికి ‘కుంటాల’ అనే పేరు వచ్చిందని స్థానికులు నమ్ముతారు. జలపాతాల హోరు మధ్య స్వయంభువుగా వెలిసిన ఈ శివలింగాన్ని దర్శించుకోవడం ఒక అపురూప అనుభూతి. మహాశివరాత్రి వేళ వేలాది మంది భక్తులు ఈ లోయలోకి దిగి స్వామివారిని దర్శించుకుంటారు.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం


