News August 14, 2024

హైకోర్టు ఏజీపీగా డిండి మండల వాసి వేణుగోపాల్

image

గుండ్లపల్లి (డిండి) మండలం టీ.గౌరారం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది పంబాల వేణుగోపాల్‌ను హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళిత నిరుపేద కుటుంబానికి చెందిన కాశమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించిన పంబాల వేణుగోపాల్ దేవరకొండలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించారు.

Similar News

News September 18, 2024

యాదాద్రి: నిమజ్జనానికి వెళ్లి యువకుడి మృతి

image

వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలంలో జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌యాదవ్ (27) వినాయక నిమజ్జనం కోసం చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతిచెందాడు. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితుడు మృతిచెందడంతో అతడి మిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News September 18, 2024

‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి’

image

రానున్న వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News September 17, 2024

ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలోని పోలీస్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ పవర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలునాయక్ తదితరులున్నారు.