News January 25, 2025
హైకోర్టు న్యాయమూర్తిగా ఖమ్మం జిల్లా వాసి ప్రమాణం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తుమ్మలపల్లికి చెందిన జస్టిస్ ఈడ తిరుమలదేవితో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు న్యాయమూర్తిగా, తెలంగాణ జ్యడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా జస్టిస్ తిరుమలాదేవి పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పదోన్నతి లభించింది.
Similar News
News February 10, 2025
సిద్దిపేట: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

సిద్దిపేట జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా తొగుట 35.5, బెజ్జంకి 35.1, కోహెడ 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుడటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News February 10, 2025
బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్: తమ్మినేని

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉందని ఖమ్మం మాజీ ఎంపీ, సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణను విస్మరించిందని, రైతును, వ్యవసాయనికి మరచినదని అన్నారు.
News February 10, 2025
5 కిలోమీటర్లకు 5 గంటల సమయం

కుంభమేళాకు వెళ్లిన ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 300 కి.మీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. 5 కి.మీ 5 గంటల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి ట్రాఫిక్ ఉండటంతో చాలామంది ఇంకా UPలోకే ఎంటర్ కాలేదు. ఇక త్రివేణీ సంగమానికి చేరుకోవడం గగనంలా మారింది. గంటలకొద్దీ వాహనాల్లోనే కూర్చోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.