News August 22, 2024
హైటెన్షన్: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధర్నా
HYDలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా కార్యక్రమం జరగనుంది. మరికాసేపట్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఆందోళన చేపట్టనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీపై కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఒకేరోజు అధికార, ప్రతిపక్ష నేతల ధర్నాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Similar News
News September 21, 2024
HYD: నేపాల్ వాళ్లకు సైతం ఇక్కడే ట్రైనింగ్!
రాజేంద్రనగర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో IPS అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ప్రోగ్రాంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్టేట్ హోం అఫైర్స్ కేంద్రమంత్రి నిత్యానందతో పాల్గొన్నారు. తామిద్దరం 16వ లోక్ సభలో సహచరులుగా ఉండటం ఇదే మొదటిసారి అని తెలిపారు. నేపాల్, భూటాన్ ప్రాంతానికి చెందిన వారు సైతం ఇక్కడే ట్రైనింగ్ పొందినట్లు ఎంపీ పేర్కొన్నారు.
News September 21, 2024
HYD: 5 మార్గాల్లో 78.6 కి.మీ మెట్రో
HYD నగరంలో రెండో దశ మెట్రో ట్రైన్ 5 మార్గాల్లో కలిపి అధికారులు 78.6 కి.మీ ప్రతిపాదించారు. 60కి పైగా స్టేషన్లు రానున్నట్లు తెలిపారు. రూ.24,042 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాలపై ఇప్పటికే పలు మార్లు సీఎం చేసిన సూచనల మేరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను వేరువేరుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు.
News September 21, 2024
నాంపల్లి: HWO జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(HWO) జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసినట్లు TGPSC అధికారులు తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tspsc.cgg.gov.in నుంచి లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని, తమ ర్యాంక్ చూసుకోవచ్చని తెలిపారు. కాగా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBRT) విధానంలో జూన్ 24 నుంచి జూన్ 29 వరకు పరీక్షలు నిర్వహించి, జులై 18న ప్రాథమిక కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.