News November 11, 2024

హైడ్రా కమిషనర్ ఇంట సకుటుంబ సర్వే 

image

గ్రేటర్ హైదరాబాద్‌లో కుల గణన సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా జరుగుతుంది. ఈ క్రమంలో మధురానగర్‌లో ఉన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి సర్వే నమోదు కోసం అధికారులు వెళ్లారు. ఒక్కోఇంటి వద్ద అరగంట సమయం పడుతుందని డాటాను ఆన్‌లైన్ అప్‌లోడ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. చార్మినార్, సికింద్రాబాద్ జాయింట్ కమిషనర్ శ్రీత్సవ కోట, కూకట్‌పల్లి, శేరిలిగంపల్లి వాటర్ బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News November 24, 2025

చర్లపల్లి టెర్మినల్‌కు ఈ రోడ్డు వేస్తే తిరుగేలేదు!

image

SCR సేవలకు వేదికైనా చర్లపల్లి టెర్మినల్‌ సక్సెస్ సాధించింది. ఈ స్టేషన్‌ను రూ.430 కోట్లతో అభివృద్ధి చేయగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది. మేడ్చల్ జిల్లాతో పాటు సిటీ శివారులోని ప్రయాణికులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉప్పల్ నుంచి చర్లపల్లి రోడ్లు తయారయ్యాయి. ఈ రోడ్లను బాగు చేస్తే మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.

News November 24, 2025

HYD సిటీ కంటే ‘సింగారం’ బెస్ట్

image

పట్నంలో ఇరుకు రహదారులు, ట్రాఫిక్‌తో ప్రజలు విసిగిపోతున్నారు. విశాల ప్రాంతమైన సిటీ శివారు ప్రతాపసింగారానికి షిఫ్ట్ అవుతున్నారు. పట్నానికి 10 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇక్కడ ఇళ్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ఫోసిస్-ORR సమీపం కావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ప్రయాణ సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీం కింద 130 ఎకరాలను సేకరించి అభివృద్ధి చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది.

News November 24, 2025

HYD: రూ.50 వేలకు 10th సర్టిఫికెట్!

image

నార్సింగి పోలీసుల దాడిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ సర్టిఫికెట్లు, బోనాఫైడ్‌ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క టెన్త్‌ సర్టిఫికెట్‌ను రూ.50,000కి, ఇంటర్‌ను రూ.75,000కి, డిగ్రీ సర్టిఫికేట్‌ను రూ.1.20 లక్షలకు అమ్మడం గమనార్హం.