News March 11, 2025
హైడ్రా ప్రజావాణికి వినతులు వెల్లువ

హైడ్రా సోమవారం ప్రజావాణిని నిర్వహించింది. ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయని అధికారులు తెలిపారు. పాత లేఔట్లు, రహదారులు, పార్కులు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని వాటిని కాపాడాలని పలువురు వినతులు అందజేశారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేస్తున్నారని వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పందన లేదని పలువురు వాపోయారు.
Similar News
News December 5, 2025
పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.
News December 5, 2025
KMR: జిల్లాలో 10 గ్రామ పంచాయతీల సర్పంచుల ఏకగ్రీవం

కామారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఘట్టం రసవత్తరంగా మారింది. 10 మండలాల పరిధిలోని 167 పంచాయతీలు, 1520 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. బుధవారంతో ఉపసంహరణ గడువు ముగియగా..10 గ్రామ పంచాయతీల సర్పంచ్ లు ఏకగ్రీవమైనట్లు DPO మురళి గురువారం వెల్లడించారు. మిగిలిన స్థానాల్లో పోటీ అనివార్యమవడంతో, ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమయ్యారు.
News December 5, 2025
మెదక్: 3వ విడత 2వ రోజు 368 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో రెండవ రోజు 368 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-43, కౌడిపల్లి-59, కుల్చారం-48, మాసాయిపేట-18, నర్సాపూర్-75, శివంపేట-73, వెల్దుర్తి-52 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 1522 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేడు చివరి రోజుకావడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.


