News March 11, 2025

హైడ్రా ప్రజావాణికి వినతులు వెల్లువ

image

హైడ్రా సోమవారం ప్ర‌జావాణిని నిర్వ‌హించింది. ప్ర‌జావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయని అధికారులు తెలిపారు. పాత‌ లేఔట్లు, ర‌హ‌దారులు, పార్కులు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని వాటిని కాపాడాల‌ని ప‌లువురు వినతులు అందజేశారు. మున్సిప‌ల్ మాజీ కౌన్సిల‌ర్లు, వార్డు మెంబ‌ర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని క‌బ్జా చేస్తున్నార‌ని వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పంద‌న లేద‌ని ప‌లువురు వాపోయారు.

Similar News

News March 5, 2026

ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: మోదీ

image

దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యం ముఖ్యమని PM మోదీ చెప్పారు. రష్యాvsఉక్రెయిన్, US-ఇజ్రాయెల్vsఇరాన్ యుద్ధాలను ప్రస్తావిస్తూ.. ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదన్నారు. ఢిల్లీలో ఫిన్‌లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ కామెంట్లు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు.

News March 5, 2026

NGKL: ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

image

నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు నోడల్ అధికారి వెంకట్ రమణ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 6,211 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 5,963 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. 248 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.

News March 5, 2026

ఇరాన్ సంచలన ప్రకటన.. భారత్‌కు గుడ్‌న్యూస్!

image

హార్ముజ్ నుంచి అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో INDతో పాటు మరికొన్ని దేశాలకు భారీ ఊరట లభించింది. త్వరలోనే మన షిప్స్ రవాణా మొదలవ్వొచ్చు. ఇక తమ నౌకాదళంతో హార్ముజ్‌లోని వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. జలసంధిని నియంత్రించే అధికారం తమకుందని, US, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పింది.