News August 25, 2024
‘హైడ్రా’ లాగా.. వరంగల్‌లో ‘వాడ్రా ‘!
వరంగల్‌లో ‘ వాడ్రా’ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే HYDలో చెరువుల రక్షణ కోసం అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అదే తరహాలో WGLలో వాడ్రా ఏర్పాటును ప్రజలు కోరుతున్నారు. ఇటీవల MLA రాజేందర్ రెడ్డి సైతం వాడ్రా ఏర్పాటుపై యోచిస్తున్నట్లు చెప్పారు. 2020లో WGLలో అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News September 15, 2024
నిమజ్జనం సందర్భంగా వరంగల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నిమజ్జనం సందర్భంగా వరంగల్ ట్రైసిటీస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. ఈ ఆంక్షలు సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఖమ్మం, ములుగు, నర్సంపేట, హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఆంక్షలు తప్పక పాటించాలని తెలిపారు.
News September 15, 2024
వరంగల్: రేపే నిమజ్జనం.. జర భద్రం
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం గణనాథుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని పద్మాక్షి గుండం, బంధం చెరువు, చిన్న వడ్డేపల్లి, ఉర్సు, కోట, బెస్తం చెరువు, ఇతర ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి మీ గణేశుడి నిమజ్జనం ఎప్పుడు? కామెంట్ చేయండి.
News September 15, 2024
వరంగల్: నిమజ్జనం కోసం చెరువులో పూడిక తీసివేత
వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో చెరువుల్లో గణేశ్ నిమజ్జనం కోసం పూడికతీత పనులను చేపట్టారు. గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో భారీ జేసీబీలతో హసన్పర్తి, కాజీపేట బంధం చెరువు, ములుగు రోడ్డులోని కోట చెరువు, దేశాయిపేట, గొర్రెకుంట, చిన్న వడ్డేపల్లి, ఖలా వరంగల్ గుండు చెరువు, రంగ సముద్రం రంగశాయిపేట బెస్తం చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు, గుర్రపు డెక్కను తొలగించారు.