News August 26, 2024
హైడ్రా వెనుక ఎలాంటి కుట్ర లేదు: బిక్షపతి గౌడ్
MLG: హైడ్రా వెనక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్ అన్నారు. ములుగులో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా తరహాలో ములుగులో భూ-కబ్జాలపై ఉక్కు పాదం మోపాలని, ప్రభుత్వ భూములను సంరక్షించి భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News September 21, 2024
జనగామ: కుటుంబ కలహాలతో తల్లీ, కూతురు ఆత్మహత్య
కుటుంబ కలహాలతో కూతురితో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ CI శ్రీను, SI కృష్ణారెడ్డి వివరాలు.. జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన రాజేశ్వర్, శారద ఉపాధికోసం బెజ్జంకి వచ్చి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన భర్త.. తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో మనస్తాపానికి గురైన శారద కూతురితో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
News September 21, 2024
క్యాబినెట్‌కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క
ఏటూరునాగారం కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ములుగు మెడికల్ కాలేజీకి పోస్టులు మంజూరుకు క్యాబినెట్ సంపూర్ణ ఆమోదం తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అవడం వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
News September 21, 2024
ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి కొండా
అణచివేతపై ధిక్కార స్వరం, ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 21న కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగ నిరతిని మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని మంత్రి అన్నారు.