News August 31, 2024

‘హైడ్రా OK.. కానీ ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చొద్దు’

image

పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జలవనరుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ ఆహ్వానించదగినదే అయినా ఏళ్ల తరబడి నాలాలు, చెరువుల పక్కన ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వాటిని కూల్చివేయడం తగదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 21, 2025

HYD: ఇలా చేస్తే మీ వాట్సాప్ హ్యాక్

image

‘హేయ్.. మీ ఫొటో చూశారా?’ అంటూ ఏదైనా లింక్‌ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త. తెలిసిన వారి నుంచి వచ్చినా పొరపాటున కూడా క్లిక్‌ చేయొద్దని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ (GhostPairing) స్కామ్ అని, ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే నకిలీ వాట్సాప్‌ వెబ్‌ పేజీ ఓపెన్‌ అవుతుందన్నారు. ఓటీపీ, స్కానింగ్ లేకుండా.. మీకు తెలియకుండా మీ వాట్సాప్‌ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్‌ అవుతుందన్నారు.

News December 21, 2025

HYD: బాబోయ్.. ఇదేం చలిరా బాబూ

image

నగరం చలికి వణికిపోతోంది. పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. స్వెటర్ లేనిదే బయటకు వెళ్లడం కష్టమైపోతోంది.
నగరగంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చలి మరీ దారుణంగా ఉంటోంది. ఈ పరిస్థితి మరో 3 రోజులు ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరిక. శేరిలింగంపల్లిలో 6.3, రాజేంద్రనగర్‌లో 7.4, మల్కాజిగిరిలో 7.5, చందానగర్‌లో 8.4, అల్వాల్‌లో 9.4°Cనమోదై చుక్కలు చూపుతోంది.

News December 21, 2025

హైదరాబాద్‌లో DANGER ☠️

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ శనివారం 255కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT