News August 31, 2024
‘హైడ్రా OK.. కానీ ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చొద్దు’
పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జలవనరుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ ఆహ్వానించదగినదే అయినా ఏళ్ల తరబడి నాలాలు, చెరువుల పక్కన ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వాటిని కూల్చివేయడం తగదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News September 18, 2024
HYD: నీటి వారోత్సవాల్లో మంత్రి ఉత్తమ్
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నేడు జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 8వ అంతర్జాతీయ నీటి వారోత్సవ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రపతి అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయంగా నీటి నిర్వహణ, అభివృద్ధి, సహకారంపై కీలకమైన అంశాలపై చర్చించారు. జలవనరుల నిర్వహణలో ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి ప్రదర్శించారు.
News September 17, 2024
HYD: నాన్న కోసం టస్కర్‌పై నుంచి దూకి యువతి మృతి
టస్కర్ కింద పడి ఓ యువతి మృతి చెందిన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. నిన్న అర్ధరాత్రి హిమాయత్‌నగర్‌లో వినాయకుడిని తీస్కెళ్తున్న టస్కర్‌పై నుంచి ఎల్బీనగర్‌కు చెందిన మహేందర్ కిందపడ్డాడు. ఆయనకోసం కుమార్తె పూజిత (17) కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.
News September 17, 2024
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన వేడుకలు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.