News March 2, 2025
హైదరాబాదులో లింగాలగట్టు యువకుడు ఆత్మహత్య

ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాదు నగరంలో జరిగింది. శ్రీశైల మండలం లింగాలగట్టుకు చెందిన నూకరాజు(27) బీటెక్ పూర్తి చేశాడు. అమీర్పేటలోని ఇంటీరియర్ లాడ్జిలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై అర్ధరాత్రి లాడ్జి గదిలోనే ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని లింగాల గట్టుకు తరలించారు.
Similar News
News December 1, 2025
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

భారత సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద క్లోజ్ అయ్యింది. హ్యుండాయ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ Ltd, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL షేర్లు లాభాలు పొందాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, DLF Ltd, ఒబెరాయ్ రియాల్టీ Ltd షేర్లు నష్టాల్లో ముగిశాయి.
News December 1, 2025
NGKL: పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం పూజలు

జిల్లా పర్యటనలో భాగంగా మక్తల్ పట్టణంలోని పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం పేరిట ప్రత్యేకంగా అర్చన చేసి ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు జూపల్లి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News December 1, 2025
NGKL: సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల నిఘా

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటన, ఎదుటివారిని కించపరిచే విధంగా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ హెచ్చరించారు. రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


