News August 27, 2024
హైదరాబాద్‌కు డెంగ్యూ ఫీవర్
HYDలో ‘డెంగ్యూ’ చాపకింద నీరులా విస్తరిస్తోంది. 404 కాలనీల్లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 5 నుంచి 15 వరకు 10 రోజుల్లో GHMC, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. 731 మందికి డెంగ్యూ, ఒకరికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే, 378 మందికి మాత్రమే డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బల్దియా లెక్కలు చెప్పడం గమనార్హం. పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీ కేర్ ఫుల్
SHARE IT
Similar News
News September 14, 2024
HYD: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య
భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. VKB జిల్లా పెద్దేముల్‌కు చెందిన భార్యభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది
News September 14, 2024
సికింద్రాబాద్: మహిళా సాధికారతపై స్పెషల్ కోర్స్
HYDలో ఉమెన్ ఎంపవర్మెంట్‌పై సికింద్రాబాద్లోని డిఫెన్స్ కాలేజీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కోర్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సాధికారత కోసం తీసుకున్న అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. డాక్టర్స్ సువర్ణ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక భరోసాపై మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
News September 14, 2024
HYD: CM రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ..!
✓చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలి.
✓చర్లపల్లి పరిసర అటవీ శాఖ, పరిశ్రమల విభాగాల భూములు స్వాధీనం చేసుకోవాలి.
✓చర్లపల్లిలో పలు పరిశ్రమలను వేరే ప్రాంతానికి తరలించాలి.
✓మూసి డెవలప్మెంట్‌పై ఫోకస్ పెట్టి, బాధిత నిర్వాసితులకు భరోసా కల్పించాలి.
✓ఇంటింటికి చెత్త సేకరణ కోసం వీలైతే GIS, QR కోడ్ స్కానింగ్ సాంకేతికత ఉపయోగించండి.