News November 12, 2024

హైదరాబాద్‌కు భగత్‌ సింగ్ మేనల్లుడి రాక

image

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ మేనల్లుడు ప్రొ. జగ్మోహన్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26న హిమాయత్‌నగర్, 27 న కుత్బుల్లాపూర్‌లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారని AISF, AIYF, CPI ప్రకటించాయి. భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగిస్తున్న ప్రొ. జగ్మోహన్ సింగ్ మేధావులు, విద్యార్థులు, యువత, ఉద్యమకారులతో ఇంట్రాక్ట్ అవుతారని తెలిపారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని MLA కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.

Similar News

News December 6, 2024

హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

image

హైదరాబాద్ జిల్లా పరిధిలోని బస్తీ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు MBBS పూర్తి చేసిన, అర్హత కల్గిన వారు walk in interviewకు హాజరు కావాలని DMHO డా వెంకటి ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ ప్యాట్ని సెంటర్ GHMC భవనంలోని 4వ అంతస్తులో ఉన్న DMHO కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలని వెల్లడించారు. ఈ సదవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలన్నారు.

News December 6, 2024

HYD: ‘లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి’

image

HYD, RR, MDCL,VKB జిల్లాలలో పలువురు అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి ఇటీవలే పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో అవినీతిని నిర్మూలించేందుకు అధికారులు మరో ముందడుగు వేసి ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డిలో అవగాహన కల్పిస్తున్నారు. ACB పోస్టర్ ఆవిష్కరించిన అధికారులు, ‘లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి’ అని పిలుపునిచ్చారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు కాల్ చేయాలన్నారు.

News December 6, 2024

మేడ్చల్: అవినీతి నిర్మూలనపై వ్యాసరచన పోటీలు

image

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ ఇందుస్ యూనివర్సల్ పాఠశాలలో అవినీతి నిర్మూలనపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, వారి ప్రతిభను కనబరిచారు. అవినీతి అనేది ఆర్థిక వ్యవస్థను, పాలన వ్యవస్థను చింద్రం చేస్తుందని అన్నారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు కాల్ చేయాలన్నారు.