News September 22, 2024
హైదరాబాద్కు వర్ష సూచన⛈️

East HYDకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్నగర్, సైదాబాద్, దిల్సుఖ్నగర్, రామంతాపూర్, అంబర్పేట, మీర్పేట, గుర్రంగూడ, వనస్థలిపురంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని HYDRAA ట్వీట్ చేసింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
Similar News
News November 27, 2025
RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్నగర్ నియోజకవర్గం, శంషాబాద్లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.

RR: ధ్రువపత్రాల కోసం మీ సేవకు పరుగులు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువ పత్రాల కోసం మీసేవ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ధ్రువపత్రాలు తప్పనిసరి కావడంతో వారితో మీసేవ సెంటర్లు కిక్కిరిసి పోయాయి. రెండో విడతలో నిర్వహించే ఎన్నికల కోసం ముందస్తుగా పత్రాలు సమకూర్చుకుంటున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల పుణ్యమా అంటూ తమకు అదనపు గిరాకీ వస్తుందని ఆమనగల్ సహా పలు సెంటర్లలోని నిర్వాహకులు చెబుతున్నారు.