News September 25, 2024
హైదరాబాద్‌కు వర్ష సూచన⛈️

హైదరాబాద్‌కు బుధవారం వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నగరంలో నిన్నటి మాదిరిగానే మళ్లీ మధ్యాహ్నం, రాత్రి సమయంలో (వరుసగా 6వ రోజు) ఉరుములతో కూడిన వర్షం పడనుంది అని తెలంగాణ వెదర్‌మ్యాన్ ట్వీట్ చేశారు. నగరవాసులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో HYDలో 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 252 స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేసిన GHMC సహాయక చర్యలు చేపడుతోంది.
Similar News
News October 17, 2025
ఇలా అయితే.. సిటీ మూసీలోకే: రఘునందన్‌రావు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని పేర్కొన్నారు. కన్నీళ్లతో ఒకరు ప్రచారానికి వస్తే.. కట్టెలు తీసుకొని ఇంకొకరు వస్తున్నారన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు వచ్చినా సిటీ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.
News October 17, 2025
HYD: ECకి నేరచరిత్ర చెప్పని అభ్యర్థులు

ఎన్నికల సమయంలో కచ్చితంగా నేర చరిత్ర ఎన్నికల సంఘానికి చెప్పాలి.. అయితే ఇప్పటి వరకు కొందరు అభ్యర్థులు తమ నేరచరిత్రను చెప్పలేదు. లోక్‌సభ ఎన్నికల్లో HYD నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏడుగురికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే వివరాలు సబ్మిట్ చేశారు. ఇక చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో ఏడుగురికి నేరచరిత్ర ఉంటే ముగ్గురే వివరాలు అందించారు.
News October 17, 2025
కేబినెట్ సబ్ కమిటీకి మెట్రో కమిటీ నివేదిక

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మెట్రో కమిటీ తన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనుంది. మెట్రో కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి నిపుణులతో మాట్లాడుతుంది. సాధ్యాసాధ్యాలపై కూలంకుశంగా విచారించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ తతంగం సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది.