News July 15, 2024
హైదరాబాద్కు BRS చేసిందేమీ లేదు: CM

HYDకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం లష్కర్గూడ సభలో ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో రంగారెడ్డి జిల్లా ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతదన్నారు. నగరానికి ORR, ఎయిర్పోర్టు, ఐటీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. డ్రగ్స్, గంజాయి తెచ్చుడు తప్పా BRS చేసిందేమీ లేదన్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 4, 2026
GHMCలో పన్నుల లెక్క.. ఎవరి పవర్ ఎంత..?

GHMC పరిధిలో ఆస్తి పన్ను మదింపు అధికారుల అధికారాలపై స్పష్టత వచ్చింది. 10 వేల చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న భవనాల పన్ను వ్యవహారాలను డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. అంతకు మించి విస్తీర్ణం ఉన్నా లేదా ఐదేళ్ల కంటే పాత బకాయిల సర్దుబాటు చేయాలన్నా నేరుగా జోనల్ కమిషనర్ అనుమతి తప్పనిసరి. చిన్నచిన్న మార్పులకు లోకల్ ఆఫీసర్ చేస్తారు కానీ పెద్ద ప్రాపర్టీల లెక్కలన్నీ జోనల్ స్థాయిలోనే తేలనున్నాయి.
News January 4, 2026
UPDATE.. HYD: అగర్ ప్లేట్స్ తయారీకి జీవాల రక్తం !

నాగారంలో పోలీసుల దాడిలో పట్టుబడిన జీవాల <<18758795>>రక్తం సేకరణ<<>> వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాబ్లో బ్యాక్టీరియా పెంపకానికి వాడే ‘అగర్ ప్లేట్ల’ తయారీ కోసం మేకలు, గొర్రెల రక్తం వాడుతున్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోషకాలు కలిగిన ఈ రక్తం ద్వారా కష్టతరమైన బ్యాక్టీరియాను పెంచుతారని నిపుణులు చెబుతున్నారు. హిమోలిసిస్ ప్రక్రియ కోసం రక్తాన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. దీనిపై విచారణ జరుగుతోంది.
News January 4, 2026
ముగిసిన GHMC విభజన.. Feb 9న CM గ్రీన్ సిగ్నల్!

GHMC కొత్త అధ్యాయం మొదలైంది. 3 కార్పొరేషన్ల ప్రక్రియ 100% పూర్తైంది. ఫైల్ వర్క్, వార్డుల పునర్విభజన సైలెంట్గా క్లోజ్ చేసేశారు. 300 వార్డులకు పెంచుతూ పాలనాపరమైన కేటాయింపులూ ముగిశాయి. ముగ్గురు సిటీ ప్లానర్లు వెంకన్న (శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్), ప్రదీప్ కుమార్ (మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్), శ్రీనివాస్ (చార్మినార్, ఖైరతాబాద్, 6 జోన్లు)కు GHMC బాధ్యతలు అప్పగించింది.


