News November 26, 2024

హైదరాబాద్‌ను కాపాడుదాం: వామపక్షాలు

image

మతోన్మాద విద్వేష శక్తుల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకుందామని వామపక్షాలు పిలుపునిచ్చాయి. బాగ్‌లింగంపల్లిలోని SVKలో “మతోన్మాద, విద్వేష శక్తుల నుంచి HYDను కాపాడుకుందాం” అని వామపక్షాల నగర సదస్సును నిర్వహించారు. గత కొంతకాలంగా నగరంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మత ఘర్షణలు జరగాలని కొన్ని మతతత్వ శక్తులు కోరుకుంటునట్లు ఉందని CPM నేత శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.

Similar News

News December 13, 2024

HYD: పండుగలా నిర్వహించండి: కలెక్టర్‌

image

సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్‌ ఛార్జిల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం డైట్, కాస్మోటిక్‌ ఛార్జీలు 40% పెంపు ప్రారంభోత్స ఏర్పాట్లపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

News December 13, 2024

ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లకు భద్రత కల్పించండి

image

మరణించిన ఆటోడ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లకు సామాజిక భద్రత బీమా పథకం రెన్యువల్‌తోపాటు, వారి కుటుంబాలకు అందించే రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచాలని INTUC నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. గురువారం మంత్రిని కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే ప్రమాదంలో అంగవైకల్యం చెందిన డ్రైవర్లకు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని మంత్రిని కోరారు.

News December 12, 2024

వికారాబాద్: ‘విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక శక్తిని వెలికి తీయాలి’

image

విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక శక్తిని వెలికి తీసి బావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని వికారాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగాడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి ప్రారంభించారు. విద్యార్థులు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు.