News January 25, 2025
హైదరాబాద్‌లోనే ‘మల్టీవాక్’ గ్లోబల్ తొలి సెంటర్: శ్రీధర్ బాబు

ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ అయిన మల్టీవాక్ గ్రూప్ తమ తొలి ఇండియా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జ్యూరిచ్ ఇన్నోవేషన్ పార్క్‌లో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ రౌండ్‌టేబుల్ సమావేశంలో మల్టివాక్ ప్రతినిధి ఉమాశంకర్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ను డిజిటల్ హబ్‌గా మారుస్తున్న ఈ ప్రయాణంలో మల్టివాక్ పాత్ర ఎంతో కీలకంగా మారనుందన్నారు.
Similar News
News September 19, 2025
నేడు YCP ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
News September 19, 2025
వరి పంట నారుమడులను పరిశీలించిన కలెక్టర్

దువ్వూరు మండలంలో సాగు చేసిన వరి పంట నారుమడులను గురువారం కలెక్టర్ శ్రీధర్ పొలాలకు వెళ్లి నేరుగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటుపై రైతులతో చర్చించారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. డిమాండ్, మార్కెట్ ఉన్న వాటిని సాగు చేయాలని సూచించారు.
News September 19, 2025
VKB: ‘మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలి’

నిరుపేద మహిళలను మహిళా సంఘాల్లో 100% చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్‌తో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు అభివృద్ధి దిశగా పయనించాలన్నారు.