News January 25, 2025

హైదరాబాద్‌లోనే ‘మల్టీవాక్’ గ్లోబల్ తొలి సెంటర్: శ్రీధర్ బాబు

image

ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ అయిన మల్టీవాక్ గ్రూప్ తమ తొలి ఇండియా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జ్యూరిచ్ ఇన్నోవేషన్ పార్క్‌లో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ రౌండ్‌టేబుల్ సమావేశంలో మల్టివాక్ ప్రతినిధి ఉమాశంకర్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ను డిజిటల్ హబ్‌గా మారుస్తున్న ఈ ప్రయాణంలో మల్టివాక్ పాత్ర ఎంతో కీలకంగా మారనుందన్నారు.

Similar News

News February 12, 2025

వాట్సాప్‌లో మరిన్ని సేవలు అందుబాటులోకి

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తూ మరిన్ని కొత్తసేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాకినాడలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు, దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇవ్వనుంది. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం వంటి క్షేత్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

News February 12, 2025

KMR: కోళ్లకు వైరస్.. కట్టడికి అధికారుల చర్యలు

image

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు హైలీ పాథోజెనిక్ అవెన్ ఫ్లూయాంజా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. కాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం కోళ్ల ఫామ్‌లో ఒకే సారి 8 వేలకుపైగా కోళ్లు మృతిచెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కోళ్ల దిగుమతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కట్టడిపై ఫోకస్ పెట్టారు.

News February 12, 2025

లావణ్యతో నార్సింగి డీఐ శ్రీనివాస్‌ వీడియో కాల్స్..!

image

నార్సింగ్ డీఐ శ్రీనివాస్‌ను ఐజీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీచేశారు. రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి లావణ్యతో తరచూ వాట్సాప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుతూ.. పరిచయం పెంచుకోవడం వీరిద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.

error: Content is protected !!