News March 26, 2024
హైదరాబాద్‌లోనే TB కేసులు అధికం
TB కేసులు గ్రేటర్ HYDలో పెరుగుతూనే ఉన్నాయి. 2023లో TGలో 73,212 మంది వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఇందులో 20 శాతం కేసులు HYDలోనే నమోదు కావడం ఆందోళనకరం. తర్వాతి స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కేసులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో 15 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువని వెల్లడించారు. దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రక్తంతో కూడిన దగ్గు వీటి లక్షణాలు. SHARE IT
Similar News
News September 19, 2024
బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం
మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.
News September 19, 2024
BREAKING..HYD: టెండర్లు ఆహ్వానిస్తున్న హైడ్రా
కూల్చివేతల వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈనెల 27 వరకు బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన విషయాన్ని ఇదివరకే ప్రకటించింది.
News September 19, 2024
HYD: పాత నేరస్థులతో ముఠా ఏర్పాటు.. వేషాలు మార్చి చోరీలు
<<14135182>>మారు వేషాలతో<<>> చోరీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. నిందితుడు సుధాకర్(33) నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఓ కేసులో జైలుకెళ్లి అక్కడ పాత నేరస్థుడు బండారిని కలిసి మరికొంత మందితో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వారు మహిళల్లా వేషాలు మార్చి చోరీలకు పాల్పడి సొత్తును సోదరుడు సురేశ్‌కు ఇచ్చి నగదు రూపంలోకి మర్చుకునేవారని తెలిపారు.